Home

»

Latest News

ఎవ‌రితోనూ హ‌ద్దులు దాట‌ను!

Jul 1, 2021 7:32PM

 

"వ్య‌క్తిగ‌త జీవితంలోనైనా, వృత్తిప‌రంగా అయినా చాలా స‌హ‌జంగా ఉంటాను. అలాగ‌ని ఎక్క‌డా హ‌ద్దులు దాట‌ను." అంటోంది టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ప్ర‌స్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' మూవీ చేస్తోంది. ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో తొలిసారి నాగార్జున‌తో జ‌త క‌డుతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆమె చేతిలో ఆరు సినిమాలున్నాయి. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30న బిజినెస్‌మ్యాన్ గౌత‌మ్ కిచ్లుతో వివాహం త‌ర్వాత కాజ‌ల్ ఇక సినిమాల‌కు దూర‌మ‌వుతుందేమోన‌ని చాలామంది అనుకున్నారు. 

అందుకు భిన్నంగా కొత్త ప్రాజెక్టులు అంగీక‌రిస్తూ, పెళ్లి త‌న కెరీర్‌కు అడ్డుకాద‌ని చెప్ప‌క‌నే చెప్తోంది. స‌మ‌యం ల‌భించిన‌ప్పుడ‌ల్లా భ‌ర్త‌తో గ‌డుపుతూ సినిమాల‌తో బిజీగా ఉండాల‌ని కాజ‌ల్ కోరుకుంటోంది. "షూటింగ్ స‌మ‌యంలో స‌హ న‌టుల‌తో ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో, సెట్‌లోంచి బ‌య‌ట‌ప‌డ్డాక అంతే దూరంగా ఉంటాను. స‌హ‌న‌టుల ద‌గ్గ‌ర హ‌ద్దులు దాట‌ను. అంత తొంద‌ర‌గా ఎవ‌రితోనూ ఫ్రెండ్‌షిప్ చెయ్య‌ను." అని చెప్తోంది కాజ‌ల్‌.

పెళ్లికి ముందు ముంబైకి ఎవ‌రైనా ఫ్రెండ్స్ వ‌చ్చి, త‌న‌ను క‌ల‌వాల‌నుకుంటే బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా త‌మ ఇంటికి భోజ‌నానికి ఆహ్వానించేదామె. "నాకు ఎదురైన రెండు ఘ‌ట‌న‌లే దానికి కార‌ణం. అవేమిట‌నేది చెప్ప‌లేను. ఆ రెండు ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు జ‌రిగిన‌వే. వాటి గురించి త‌ల‌చుకుంటే నేను నాలా ఉండ‌ను." అని చెప్పింది కాజ‌ల్‌. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com