Home

»

Latest News

గొప్ప మనసు చాటుకున్న సంపూర్ణేష్ బాబు

Jul 1, 2021 8:42PM

రియల్ హీరోలు అనిపించుకునే రీల్ హీరోలు అరుదుగా ఉంటారు. వారిలో సంపూర్ణేష్‌ బాబు ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆర్ధిక సాయం చేసి ఎందరికో అండగా నిలబడిన సంపూర్ణేష్‌.. మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు బాలికలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారిని చదివించేందుకు ముందుకొచ్చాడు.

దుబ్బాకకు చెందిన నరసింహచారి దంపతులు అప్పుల భారం మోయలేక ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరూ కూమార్తెలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలుసుకొని చలించిపోయిన సంపూర్ణేష్‌.. తక్షణమే వారికి 25 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. హృదయకాలేయం, కొబ్బరిమట్ట నిర్మాత సాయి రాజేష్ తో కలిసి.. ఆ పిల్లల చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను కూడా చూసుకుంటామని సంపూర్ణేష్ మాట ఇచ్చాడు. ఈ విషయాన్ని సంపూర్ణేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

కాగా సంపూర్ణేష్ ప్రస్తుతం ‘బజారు రౌడీ, ‘క్యాలీఫ్లవర్‌’, ‘పుడింగి నంబర్‌ వన్‌’ సినిమాల్లో నటిస్తున్నాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com