![]() |
![]() |

ఆన్ స్క్రీన్ పై రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో.. ఆఫ్ స్క్రీన్ లోనూ ఆయనను అభిమానించేవారు అంతే అంటారు. అందరినీ నవ్వుతూ పలకరించడం.. తోటి నటీనటులకు ఫుడ్ ఐటమ్స్ పంపించడం, సర్ర్పైజ్ లు ఇవ్వడం ప్రభాస్ కి అలవాటు. తాజాగా సీనియర్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీని ప్రభాస్ సర్ర్పైజ్ చేశారు.
నటి భాగ్యశ్రీకి ప్రభాస్ రుచి కరమైన పూతరేకులను పంపించారు. పూతరేకుల రుచికి ఫిదా అయ్యానంటూ ఆ ఆనందాన్ని భాగ్యశ్రీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. స్వీట్‌బాక్స్ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆమె.. 'హైదరాబాదీ మిఠాయిల్లో ప్రత్యేకమైన పూతరేకులు అందించినందుకు ధన్యవాదాలు ప్రభాస్. యు స్పాయిల్ మీ' అని ట్వీట్ చేశారు.
కాగా, రాధాకృష్టకుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ 'రాధేశ్యామ్' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా.. భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపించనున్నారు.
![]() |
![]() |