![]() |
![]() |

శర్వానంద్ హీరోగా శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. శర్వానంద్ 30 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి 'ఒకే ఒక జీవితం' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.
'ఒకే ఒక జీవితం' పోస్టర్ లో శర్వానంద్ భుజానికి ఓ గిటార్ బ్యాగ్ తగిలించుకుని సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో ఒకవైపు పల్లెటూరు, మరోవైపు పట్నం కనిపిస్తున్నాయి. ఓ వైపు పోస్టాఫీసు, ఉత్తరం, క్యాసెట్, గాలిపటాలు వంటి జ్ఞాపకాలు.. మరోవైపు సెల్ టవర్, మొబైల్, ఐపాడ్, ఫ్లైట్ వంటి ప్రస్తుత మన జీవితాలు ఉన్నాయి. ఉత్తరాల కాలం నుంచి సెల్‌ఫోన్ వరకు, పల్లెటూరు నుంచి పట్నం వరకు మన జీవితాలలో వచ్చిన మార్పులకు ఇది అద్దం పడుతుంది.
'ఒకే ఒక జీవితం' చిత్రం ద్వారా 'ఉన్నది ఒకటే జీవితం.. దాన్ని ప్రతిక్షణం ఆస్వాదించాలని చెప్పబోతున్నట్టు' తెలుస్తోంది. ఈ మూవీలో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ నటిస్తోంది. అక్కినేని అమల ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలోనే టీజర్‌ను కూడా రిలీజ్ చేయనుంది చిత్ర బృందం.
![]() |
![]() |