![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, మెలోడీ బ్రహ్మ మణిశర్మది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాంటి చిరు, మణి కాంబినేషన్ లో 15 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం వస్తున్న చిత్రం `ఆచార్య`. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తుండగా.. చిరుకి జంటగా కాజల్, చరణ్ కి జోడీగా పూజా హెగ్డే సందడి చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. ఆ మధ్య ``లాహే లాహే`` అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసిన యూనిట్.. త్వరలో సెకండ్ సింగిల్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా జూలై 11న ఈ రెండో పాట తాలూకు లిరికల్ వీడియోని రిలీజ్ చేయనున్నారట. మణి మార్క్ మెలోడీతో ఈ పాట రూపొందిందని సమాచారం. మరి.. మణి బర్త్ డే స్పెషల్ రానున్న ఈ పాట యూట్యూబ్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
కాగా, `ఆచార్య`కి సంబంధించిన చిత్రీకరణ తుదిదశలో ఉంది. త్వరలోనే షూటింగ్ ని పునః ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
![]() |
![]() |