![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 'మా' అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మాటల యుద్ధం కూడా ప్రారంభమైంది. ప్రకాష్ రాజ్ ని నాన్ లోకల్ అంటూ కొందరు వ్యతిరేకిస్తుండగా.. నాలుగేళ్ళుగా మా ప్రతిష్ట మసక బారిందంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు సీవీఎల్ తెలంగాణ వాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ఇలా మా ఎన్నికల టాపిక్ గరంగరంగా సాగుతుంటే.. యాక్టర్ బ్రహ్మాజీ మాత్రం కూల్ గా కామెడీ చేసి నవ్విస్తున్నారు.
తాజాగా బ్రహ్మాజీ ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ బ్రహ్మాజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే.. బ్రహ్మాజీ మాత్రం నమస్కరిస్తున్నట్టు ఉంది. ఈ ఫొటోతో పాటు "ఇది సాధారణ మీటింగ్ మాత్రమే. ఎలాంటి రాజకీయాలకు తావులేదు. 'మా' ఎన్నికల గురించి చర్చించాం. ఆయన నాకు కొన్ని టిప్స్ చెప్పారు" అంటూ బ్రహ్మాజీ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఫన్నీగా ఉండటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, మా ఎన్నికల బరిలో బ్రహ్మాజీ కూడా ఉన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులలో బ్రహ్మాజీ కూడా ఒకరు. ఇటీవల ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మందితో జాబితాను విడుదల చేశారు. అందులో జయసుధ, శ్రీకాంత్, సాయికుమార్, బ్రహ్మాజీ వంటి వారున్నారు.
![]() |
![]() |