![]() |
![]() |

లేడీ సూపర్ స్టార్ నయనతార చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. వీటిలో మూడు తమిళ చిత్రాలు కాగా.. రెండు మలయాళ సినిమాలు. తమిళ సినిమాల విషయానికి వస్తే `నెట్రిక్కన్` విడుదలకు సిద్ధం కాగా.. `అణ్ణాత్తే`, `కాత్తువాక్కుల రెండు కాదల్` చిత్రీకరణ దశలో ఉన్నాయి. మరోవైపు `పాట్టు`తో పాటు మరో మాలీవుడ్ ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది నయన్.
వీటిలో `పాట్టు` చిత్రం కోసం కొత్త తరహా పాత్రలో దర్శనమివ్వనుందట నయనతార. అంతేకాదు.. సంగీతభరిత చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఏకంగా 11 పాటలుంటాయట. ఇవన్నీ కూడా సంగీత ప్రియులను అలరించేలా ఉంటాయని టాక్.
`పాట్టు`లో మాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. `ప్రేమమ్` వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. `పాట్టు`పై మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు, `పాట్టు`కి ఆల్ఫోన్స్ పుత్రేన్ నే స్వయంగా బాణీలు అందిస్తున్నాడట.
మరి.. `నేరమ్`, `ప్రేమమ్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ఆల్ఫోన్స్ నుంచి వస్తున్న `పాట్టు` అతనికి హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. అలాగే, నయన్ ఖాతాలో మరో సక్సెస్ ఫుల్ వెంచర్ యాడ్ అవుతుందా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.
![]() |
![]() |