![]() |
![]() |

'రామాయణ్' సీరియల్ తో నటుడిగా మంచి గుర్తింపు పొందిన చంద్రశేఖర్ (98) కన్నుమూశారు. వయోభారంతో ఆయన ముంబైలోని స్వగృహంలో బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిర్మాత అశోక్ శేఖర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. "నాన్నగారు నిద్రలోనే కన్నుమూశారు. ఆయనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. వయసు మీద పడటంతోనే చనిపోయారు" అని అశోక్ శేఖర్ ట్వీట్ చేశారు.
చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్. నటనపై మక్కువతో 1950లో జూనియర్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత 'సురంగ్' అనే మూవీతో హీరోగా పరిచయమయ్యారు. కవి, మస్తానా, బసంత్ బహార్, గేట్ ఆఫ్ ఇండియా, ఫ్యాషన్, ధర్మ, డ్యాన్స్ డ్యాన్స్ తదితర సినిమాల్లో నటించి మెప్పించారు. 250కి పైగా సినిమాలలో ఆయన నటించారు. 1964లో స్వీయ నిర్మాణంలో 'ఛ ఛ ఛ' అనే సినిమాకి దర్శకత్వం వహించారు.
రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన 'రామాయణ్' సీరియల్ తో మరింత ఫేమస్ అయ్యారు చంద్ర శేఖర్. ఇందులో దశరథుని మహామంత్రి ఆర్య సుమంత్ అనే పాత్ర పోషించారు. చంద్ర శేఖర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
![]() |
![]() |