![]() |
![]() |

గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన `భీష్మ`తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన యూత్ స్టార్ నితిన్.. ఈ సంవత్సరం మళ్ళీ ట్రాక్ తప్పాడు. `చెక్`, `రంగ్ దే` రూపంలో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చూశాడు. ఈ నేపథ్యంలో.. రాబోయే `మాస్ట్రో`పైనే తన ఆశలు పెట్టుకున్నాడు నితిన్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంధాధున్`కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ.. తుది దశకు చేరుకుంది.
ఇదిలా ఉంటే.. `మాస్ట్రో` తరువాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు నితిన్ సన్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు.. `మాస్ట్రో` ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తమ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో ఓ చిత్రం చేయబోతున్నాడట నితిన్. శేఖర్ చెప్పిన కథ ఎంతగానో నచ్చడంతో పాటు ఈ ప్రాజెక్ట్ పై ఉన్న నమ్మకంతో.. సొంత సంస్థలో ఈ మూవీ చేయబోతున్నాడట నితిన్. త్వరలోనే నితిన్ - శేఖర్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది. మరి.. ఇంతవరకు ఎడిటర్ గా రాణించిన ఎస్.ఆర్. శేఖర్.. దర్శకుడిగానూ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |