![]() |
![]() |

తెలుగు సినిమా 'బుర్రకథ'తో వెండితెరకు పరిచయమైన ముంబై నటి నైరాషా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడింది. ముంబయిలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాదకద్రవ్యాలు ఉపయోగిస్తూ దొరికిపోయింది. ఆమెను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్.సి.బి) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నైరాషా తన పుట్టినరోజు సందర్భంగా జుహూ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో తన బాయ్ ఫ్రెండ్ ఆషిక్ సాజిద్ హస్సేన్ తో కలిసి పార్టీ చేసుకుంది. సదరు హోటల్ లో డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో అదేరోజు తెల్లవారుజామున ఎన్.సి.బి అధికారులు అక్కడ తనిఖీలు చేశారు. ఈక్రమంలో నైరాతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ గంజాయి నింపిన సిగరెట్లు తాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లోనూ నైరా షా, ఆమె బాయ్ ఫ్రెండ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
2019లో వచ్చిన బుర్రకథ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది నైరాషా. ఈ చిత్రంలో ఆది హీరో కాగా, నైరా షా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు.
![]() |
![]() |