![]() |
![]() |

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లవ్ స్టోరీ'. ఈ మూవీ ఫస్ట్ కాపీ ఎప్పుడో రెడీ అయింది. ఏప్రిల్ 16 న థియేటర్స్ లో రిలీజ్ కూడా చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే త్వరలో తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ కానున్నాయన్న వార్తల నేపథ్యంలో.. లవ్ స్టోరీ మూవీ త్వరలో రిలీజ్ కానుందని ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ పై తాజాగా నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
'లవ్ స్టోరి' చిత్ర నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ తాజా ఇంటర్వ్యూలో సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందన్నారు. థియేటర్లలో రోజుకు 3 ప్రదర్శనలకు మాత్రమే అనుమతిస్తే.. మా సినిమాను రిలీజ్ చేయాలని అనుకోవట్లేదని స్పష్టం చేశారు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తామని, నైట్ కర్ఫ్యూ తీసిన వారం తరువాత ఈ సినిమా విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. జూలై రెండో వారం తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. త్వరలోనే లవ్ స్టొరీ విడుదల తేదీని అధికారికంగా వెల్లడిస్తామని సునీల్ నారంగ్ తెలిపారు.
ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టొరీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'సారంగ దరియా' పాట యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
![]() |
![]() |