![]() |
![]() |

ఆ మధ్య దర్శకుడు `శౌర్యం` శివతో వరుస సినిమాలు చేసి టాక్ ఆఫ్ కోలీవుడ్ అయిన `తల` అజిత్.. ప్రస్తుతం `ఖాకి` ఫేమ్ హెచ్. వినోద్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. `పింక్` రీమేక్ `నేర్కొండ పార్వై` కోసం తొలిసారి జట్టుకట్టి హిట్టుకొట్టిన అజిత్ - వినోద్.. ప్రస్తుతం `వాలిమై` కోసం కలిసి పనిచేస్తున్నారు. `నేర్కొండ పార్వై`ని నిర్మించిన ప్రముఖ నిర్మాత బోనీకపూర్.. ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. సీబీసిఐడిగా అజిత్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. చిత్రీకరణ తుదిదశలో ఉంది.
ఇదిలా ఉంటే.. `నేర్కొండ పార్వై`, `వాలిమై` తరువాత వినోద్ కాంబినేషన్ లోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని చేయనున్నారట అజిత్. ఈ సినిమాని కూడా బోనీ కపూర్ నే నిర్మించబోతున్నారని సమాచారం. అంతేకాదు.. కేవలం రెండు నెలల చిత్రీకరణ లక్ష్యంగా ఈ మూవీ పట్టాలెక్కనుందట. అలాగే, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి.. `నేర్కొండ పార్వై` తరువాత అజిత్ - వినోద్ కాంబినేషన్ లో రానున్న రెండు సినిమాలు కూడా విజయపథంలో పయనించి.. వారి కాంబోకి హ్యాట్రిక్ అందిస్తాయేమో చూడాలి.
![]() |
![]() |