![]() |
![]() |

సమంత అక్కినేని ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయారు. ఓ వైపు 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'లో చేసిన రాజీ పాత్రకు అన్ని వైపుల నుంచీ ప్రశంసలు అందుకుంటూనే, మరోవైపు కాంట్రవర్సీస్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. నాగచైతన్యను పెళ్లాడాక, అర్థవంతమైన, పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేస్తూ వస్తున్న ఆమె, తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే, 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సూపర్ సక్సెస్ కావడంతో సమంత తన రెమ్యూనరేషన్‌ను పెంచేశారంట.
'ద ఫ్యామిలీ మ్యాన్ 2' రిలీజయ్యాక ఆమె నటనను తెగ మెచ్చుకుంటూ అనేకమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతేకాదు, ఆమెకు పలు హిందీ సినిమాల ఆఫర్లు కూడా వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఆమె ఫస్ట్ ఏ సినిమా చేస్తుందనేది ఇప్పుడు ఇంటరెస్టింగ్ పాయింట్.
రాజీ క్యారెక్టర్‌లో తన పర్ఫార్మెన్స్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో క్లౌడ్ 9లో ఉన్న ఈ 'మజిలీ' తార, "ద ఫ్యామిలీ మ్యాన్ 2 రివ్యూలను ఫస్ట్ డే చూశాను. దాంతో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అందుకు తగ్గట్లే అది సూపర్ సక్సెస్ కావడం హ్యాపీగా ఉంది. అందరూ దాన్ని ప్రశంసిస్తుంటే, చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఇది నా అతిపెద్ద సాఫల్యత." అని చెప్పారు. బహుశా అందుకేనేమో, ఆమె తన పారితోషికాన్ని పెంచేశారు.
అయితే రాజీగా ఆమె స్కిన్ కలర్‌పైనా, శ్రీలంక తమిళురాలిగా ఆమె పాత్రను చూపించిన తీరుపైనా తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. భారతీరాజా లాంటి లెజెండరీ డైరెక్టర్ సైతం ఈ సిరీస్‌లో తమిళుల్ని దారుణంగా చూపించారని మండిపడ్డారు.
![]() |
![]() |