![]() |
![]() |

యాక్షన్ హీరో గోపీచంద్ `పక్కా కమర్షియల్` పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. `ప్రతి రోజూ పండగే` వంటి బ్లాక్ బస్టర్ తరువాత మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో స్టన్నింగ్ బ్యూటీ రాశీ ఖన్నా నాయికగా నటిస్తోంది. `జిల్`, `ఆక్సిజన్` తరువాత గోపీచంద్ కాంబినేషన్ లోనూ.. `ప్రతి రోజూ పండగే` అనంతరం మారుతి దర్శకత్వంలోనూ రాశి నటిస్తున్న సినిమా ఇది. ఇందులో గోపీచంద్ కి తండ్రిగా సత్యరాజ్ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక షూటింగ్ పునః ప్రారంభించేందుకు మారుతి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే.. `పక్కా కమర్షియల్`కి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ డేట్ కర్చీప్ పోస్టర్, టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది యూనిట్. కాగా, గోపీచంద్ ఫస్ట్ లుక్ ని అతని పుట్టిన రోజు సందర్భంగా జూన్ 12న విడుదల చేయనున్నారట. `పక్కా కమర్షియల్`లో గోపీచంద్ లాయర్ పాత్రలో దర్శనమివ్వనున్నారు. బహుశా ఆ లుక్ తోనే గోపీచంద్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి. అన్నీ అనుకూలంగా ఉంటే ముందుగా ప్రకటించిన అక్టోబర్ 1నే `పక్కా కమర్షియల్` విడుదలయ్యే అవకాశముంది.
![]() |
![]() |