![]() |
![]() |

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన కాజల్ అగర్వాల్.. హిందీలోనూ కొన్ని సినిమాల్లో సందడి చేసింది. వాటిలో `సింఘమ్` ఒకటి. ఈ బ్లాక్ బస్టర్ మూవీలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కి జోడీగా నటించింది కాజల్. ఈ సినిమానే హిందీలో కాజల్ కి నాయికగా తొలి చిత్రం కావడం విశేషం. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన సూర్య `సింగమ్` చిత్రానికి బాలీవుడ్ వెర్షన్ నే ఈ `సింఘమ్`.
ఇదిలా ఉంటే.. పదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం అజయ్, కాజల్ జంట మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ సారి కూడా ఈ ఇద్దరూ రీమేక్ కోసం జట్టుకట్టనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. కార్తి కథానాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించిన `ఖైదీ` చిత్రాన్ని హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు పలు మార్పు చేర్పులతో బాలీవుడ్ లో పునర్నిర్మించనున్నారట. కాగా, ఇందులో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించనుండగా.. అతని భార్య పాత్రలో కాజల్ కనిపించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.
మరి.. సూర్య `సింగమ్`ని రీమేక్ చేసి ఘనవిజయం అందుకున్న అజయ్, కాజల్ జోడి.. ఈ సారి సూర్య తమ్ముడు కార్తి నటించిన `ఖైదీ`ని టార్గెట్ చేసి రీమేక్ చేస్తున్న వైనం ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |