![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ రోర్ పేరుతో వదిలిన టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రేపు(గురువారం) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులను ఖుషీ చేయడానికి.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. బాలకృష్ణ నవ్వుతూ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది.
బాలకృష్ణకు బర్త్ డే విషెస్ తెలుపుతూ రిలీజ్ చేసిన 'అఖండ' న్యూ పోస్టర్ కలర్ ఫుల్ గా ఉంది. పోస్టర్ చూస్తుంటే ఇది సెలబ్రేషన్ మూడ్ లో వచ్చే సాంగ్ లోదని అర్థమవుతోంది. ప్రజలు సంబరాలు జరుపుతూ ఉంటే.. బాలకృష్ణ దర్జాగా నడుచుకుంటూ రావడం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా ముందురోజే విడుదలైన ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా, బాలయ్య-బోయపాటి కాంబినేషన్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత.. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా కావడంతో అఖండపై భారీ అంచనాలున్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో.. హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. దసరాకు విడుదలయ్యే అవకాశముంది.
![]() |
![]() |