![]() |
![]() |
.jpg)
ఈ కరోనా విపత్కర సమయంలో ఎంతో సేవ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు సోనూసూద్. ఇప్పటికే ఎన్నో రకాలుగా ఎందరికో అండగా నిలబడిన ఆయన.. మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎందరో ఆక్సిజన్ అందక మహమ్మారి కాటుకు బలయ్యారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని సోనూసూద్ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, నెల్లూరుతో పాటు కర్ణాటకలోని మంగళూరులో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనున్న ఆయన.. ఆ తరువాత తమిళ్ నాడు, పంజాబ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్య ప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ 18 ప్లాంట్స్ తో దాదాపు 5500 బెడ్స్ కి ఆక్సిజన్ అందించవచ్చు.
ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు గురించి సోనూసూద్ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా ఆక్సిజన్ కొరత పెద్ద సమస్యగా ఉందని.. అందుకే తాను, తన టీం కలిసి ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం అన్నారు. ఈ ప్లాంట్స్ పేదవారు వైద్యం తీసుకునే హాస్పిటల్స్ కి దగ్గరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
![]() |
![]() |