![]() |
![]() |

తెలుగునాట ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో పలు యాక్షన్ ఎంటర్టైనర్స్ తెరకెక్కాయి. వాటిలో `సాంబ` ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. విద్యాదానం గొప్పతనం చుట్టూ అల్లుకున్న ఫ్యాక్షన్ డ్రామా ఇది. `ఆది` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత ఎన్టీఆర్ - స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్.. `సింహాద్రి` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత తారక్ - భూమికా చావ్లా కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించనప్పటికీ.. ఎన్టీఆర్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది.
జెనీలియా మరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, విజయకుమార్, సితార, సుకన్య, సుకుమారి, అలీ, కృష్ణ భగవాన్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, చలపతిరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. కొడాలి నాని ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతమందించిన ఈ సినిమాలోని పాటలన్నీ మాస్ ఆడియన్స్ ని అలరించాయి. కన్నడంలో `మండ్య` (దర్శన్, రక్షిత, రాధిక), బెంగాలీ బంగ్లాదేశ్ లో `ఏక్ రోఖా` (మన్న) పేర్లతో ఈ సినిమా రీమేక్ అయింది.
2004 జూన్ 9న విడుదలై ఒక వర్గం ప్రేక్షకులను అలరించిన `సాంబ`.. నేటితో 17 ఏళ్ళను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |