![]() |
![]() |

తెలుగు, కన్నడ, హిందీ.. ఇలా మూడు భాషల్లో సినిమాలు రూపొందించిన వైనం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సొంతం. అలాంటి పూరి.. తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రమే.. 'లైగర్'. ఇందులో టైటిల్ రోల్ లో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ దర్శనమివ్వనున్నారు. అతనికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.. తల్లి పాత్రలో సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ స్పోర్ట్స్ డ్రామాకి సంబంధించి సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. అయితే, కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని టాక్. సినిమాకి హైలైట్ గా నిలిచే ఈ దృశ్యాల్లో విజయ్ దేవరకొండ నటన కట్టిపడేస్తుందని.. సినిమా అంతా ఒకెత్తు అయితే, ఈ పతాక సన్నివేశాలు మరొక ఎత్తు అని అంటున్నారు.
మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే 'లైగర్' విడుదలయ్యేంత వరకు వేచిచూడాల్సిందే. కాగా, సెప్టెంబర్ 9న 'లైగర్'ని రిలీజ్ చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు 'లైగర్'ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
![]() |
![]() |