![]() |
![]() |
.jpg)
సౌత్ ఇండియాలోని మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్‌లలో తమన్నా ఒకరు. 2005లో 15 సంవత్సరాల వయసులో మంచు మనోజ్ సరసన నటించిన 'శ్రీ' మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన ఆమె, శేఖర్ కమ్ముల చిత్రం 'హ్యాపీ డేస్'తో యువతరం కలలరాణిగా అవతరించింది. ఆ తర్వాత ఇటు తెలుగు, అటు తమిళ చిత్రసీమల్లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది తమన్నా. 'బాహుబలి' మూవీలో చేసిన అవంతిక పాత్ర ఆమెను నేషనల్ క్రష్‌గా మార్చేసింది. ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి 65 సినిమాల దాకా ఆమె నటించింది.
ఇప్పటివరకూ సినిమాల ద్వారా కానీ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కానీ, సొంత బిజినెస్ ద్వారా కానీ ఆమె సంపాదించింది రూ. 110 కోట్ల దాకా ఉంటుందని ఒక అంచనా. ఇవాళ ఒక సినిమాకి సంతకం చేయడానికి ఆమె వసూలు చేస్తున్న పారితోషికం రూ. 1.75 కోట్లని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అదే ఐటమ్ సాంగ్ చేయడానికైతే రూ. 60 లక్షలు తీసుకుంటోందట. భారతదేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన మొబైల్ ప్రీమియర్ లీగ్, సెల్‌కాన్ మొబైల్స్, ఫాంటా, చంద్రిక ఆయుర్వేద సబ్బు లాంటి బ్రాండ్లు ఆమె చేతిలో ఉన్నాయి. ఐపీఎల్ 2018 ప్రారంభోత్సవంలో 10 నిమిషాల పర్ఫార్మెన్స్‌కు గాను ఆమెకు రూ. 50 లక్షలు అందాయని సమాచారం. ప్రస్తుతం ఆమె సంపాదన నెలకు సగటున కోటి రూపాయలు. అంటే ఏడాదికి రూ. 12 కోట్లు!
2015లో 'వైట్ అండ్ గోల్డ్' అనే ఆన్‌లైన్ జ్యూయలరీ స్టోర్‌ను ప్రారంభించింది తమన్నా. దీని ద్వారా తనలోని జ్యూయలరీ డిజైనింగ్ టాలెంట్‌ను కూడా ఆమె చూపిస్తోంది. ముంబైలోని వర్సోవాలో ఆమెకు సొంత అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఉంది. దాన్ని రూ. 16.60 కోట్లతో ఆమె కొనుగోలు చేసింది. ఆమె దగ్గర కొన్ని లగ్జరియస్ కార్లు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఆమె తెలుగులో గోపీచంద్‌తో 'సీటీమార్', వెంకటేశ్‌తో 'ఎఫ్3', నితిన్‌తో 'మ్యాస్ట్రో', సత్యదేవ్‌తో 'గుర్తుందా శీతాకాలం' సినిమాలు చేస్తోంది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు పెరుగుతున్న ఆదరణను గమనించిన తమన్నా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేయడానికి కూడా ముందుకొచ్చింది. ఇప్పటికే ఆహాలో 'లెవన్త్ అవర్' (తెలుగు), డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 'నవంబర్ స్టోరీ' (తమిళ్) స్ట్రీమింగ్ అవుతున్నాయి.
![]() |
![]() |