![]() |
![]() |

అభినయంతో కాక అందంతో కట్టిపడేసే కథానాయికల్లో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. `మజ్ను`తో తెలుగు చిత్ర సీమ బాట పట్టిన ఈ కలువ కళ్ళ సుందరి.. ఆపై `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`, `ఆక్సిజన్`, `అజ్ఞాతవాసి`, `నా పేరు సూర్య`, `గీత గోవిందం` (అతిథి పాత్ర), `శైలజా రెడ్డి అల్లుడు`, `అల్లుడు అదుర్స్` వంటి చిత్రాల్లో సందడి చేసింది. వీటిలో అను హీరోయిన్ గా నటించిన సినిమాలేవీ అంతగా ఆదరణ పొందలేదు.
కట్ చేస్తే.. ప్రస్తుతం అను చేతిలో రెండు టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి.. శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో రూపొందుతున్న `మహాసముద్రం` కాగా, మరొకటి అల్లు శిరీష్ కి జంటగా నటిస్తున్న `శిరీష్ 6` (వర్కింగ్ టైటిల్). ఈ రెండు సినిమాలపైనే తన ఆశలు పెట్టుకుంది అను. మరి.. మెగాకాంపౌండ్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (అజ్ఞాతవాసి), స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (నా పేరు సూర్య) అంతగా అచ్చిరాని నేపథ్యంలో.. అదే క్యాంప్ కి చెందిన శిరీష్ అయినా అనుకి కలిసొస్తాడేమో చూడాలి. అసలే.. సాలిడ్ హిట్ లేని శిరీష్ కి కూడా ఈ సినిమా విజయం కీలకమే మరి. చూద్దాం.. ఏం జరుగుతుందో?
![]() |
![]() |