![]() |
![]() |

తన బయోపిక్ ను తెరకెక్కించాలంటూ లెజెండరీ సింగర్ పి.సుశీల.. ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ను కోరారు. '99 సాంగ్స్' సినిమా చూసిన సుశీల.. ఆ సినిమా మాదిరి తన బయోపిక్ కూడా తీయాలని కోరారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ స్వయంగా చెప్పారు.
'99 సాంగ్స్' మూవీతో రెహమాన్ స్క్రీన్ రైటర్‌గా మారారు. ఈ మూవీలో ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించగా.. దీనికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ మూవీ హిందీ, తమిళ్, తెలుగు వర్షన్లు ప్రస్తుతం జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్ లలో ప్రసారం అవుతున్నాయి. ఇటీవలే ఈ సినిమాను చూసిన పి.సుశీల ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. “రీసెంట్ గా సుశీలమ్మతో మాట్లాడాను. ఆమెను '99 సాంగ్స్' మూవీ చూసారా? అని అడిగాను. ఇంకా సినిమా చూడకపోతే నెట్‌ఫ్లిక్స్ లో చూడమని చెప్పాను. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆమె సోదరుడికి ఈ మూవీ తెలుగు వర్షన్ ను సుశీలమ్మకు చూపించమని రిక్వెస్ట్ చేశాను. సినిమా చూసిన తరువాత సుశీలమ్మ మా టీమ్ ని మెచ్చుకున్నారు. '99 సాంగ్స్' మాదిరి తన బయోపిక్ కూడా తీయాలని ఆమె కోరారు”అని తెలిపారు. మరి సుశీలమ్మ కోరినట్లుగా రెహమాన్ ఆమె బయోపిక్ ను తెరకెక్కిస్తారేమో చూడాలి.
![]() |
![]() |