![]() |
![]() |

వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న బాలీవుడ్ కథానాయికల్లో దీపికా పదుకొణే ఒకరు. మరీ ముఖ్యంగా.. వెర్సటైల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో అలరించింది ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్. `గోలీయోంకా రాస్ లీలా రామ్ లీల`, `బాజీరావ్ మస్తానీ`, `పద్మావత్`.. ఇలా భన్సాలీ, దీపికా కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిందీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `బైజు బావ్రా` పేరుతో సంజయ్ లీలా భన్సాలీ ఓ సినిమాని రూపొందించనున్నారట. ఇందులో రూపమతి అనే బందిపోటు నాయకురాలు పాత్రలో దీపిక నటించబోతోందట. 2022లో ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని బాలీవుడ్ ఖబర్.
కాగా, ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన `గంగూబాయి కతియావాడి` విడుదలకు సిద్ధమైంది. జూలై 30న విడుదల కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రచారం సాగుతోంది.
![]() |
![]() |