![]() |
![]() |

అటు మెగాస్టార్ చిరంజీవి - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తోనూ.. ఇటు మెలోడీబ్రహ్మ మణిశర్మతోనూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ చేస్తున్న తొలి చిత్రం `ఆచార్య`. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక.. చిత్రీకరణ పునః ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. ఆమధ్య ఫస్ట్ సింగిల్ `లాహే లాహే`తో ఇంప్రెస్ చేసిన యూనిట్.. త్వరలో సెకండ్ సింగిల్ తో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. కొరటాల శివ బర్త్ డే సందర్భంగా జూన్ 15న `ఆచార్య` సెకండ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు.. రామ్ చరణ్, పూజా హెగ్డేపై చిత్రీకరించిన పాట ఇదని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి స్పష్టత రానున్నది.
`ఆచార్య`లో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సోనూ సూద్, ప్రకాశ్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని దసరా సీజన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు బజ్.
![]() |
![]() |