![]() |
![]() |

బ్లాక్ బస్టర్ మూవీ `ధూమ్ 2` (2006)లో నెగెటివ్ టచ్ రోల్ లో ఇంప్రెస్ చేశారు బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్. కట్ చేస్తే.. 15 ఏళ్ళ తరువాత మరోమారు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో దర్శనమివ్వబోతున్నారు మిస్టర్ రోషన్.
ఆ వివరాల్లోకి వెళితే.. తమిళనాట ఘనవిజయం సాధించిన `విక్రమ్ వేద` (2017) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు మాతృక దర్శకులు పుష్కర్ - గాయత్రి. తమిళ వెర్షన్ లో `మక్కల్ సెల్వన్` విజయ్ సేతుపతి పోషించిన గ్యాంగ్ స్టర్ వేద పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనుండగా.. మాధవన్ ధరించిన పోలీస్ అధికారి విక్రమ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అలరించనున్నాడు. ఇదిలా ఉంటే.. తను పోషిస్తున్న `వేద` పాత్ర కోసం బనారసి యాస ప్రత్యేకంగా నేర్చుకుని మరీ నటించబోతున్నారట `క్రిష్` స్టార్. అంతేకాదు.. 60 శాతం వారణాసి నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం హృతిక్ `ధోతి` లుక్ లోనూ దర్శనమివ్వనున్నట్లు టాక్.
తన ప్రీవియస్ మూవీ `సూపర్ 30`లో బీహారి యాక్సెంట్ తో ఇంప్రెస్ చేసిన హృతిక్ రోషన్.. `విక్రమ్ వేద`లో బనారసి యాసతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి. కాగా, త్వరలోనే ఈ క్రేజీ రీమేక్ సెట్స్ పైకి వెళ్ళనుంది.
![]() |
![]() |