![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న `ఖిలాడి` కాగా.. మరొకటి ఉగాది పర్వదినాన పట్టాలెక్కిన శరత్ మండవ డైరెక్టోరియల్. ఇంకొకటి.. `నేను లోకల్` డైరెక్టర్ త్రినాథరావ్ నక్కిన తెరకెక్కించనున్న సినిమా.
ఇదిలా ఉంటే.. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా.. ఇప్పటికే ఓ హీరోయిన్ గా `మజిలీ` ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఎంపికైంది. కాగా, మరో నాయికగా కేరళకుట్టి రజీషా విజయన్ ని సెలెక్ట్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.
మలయాళంలో ఇప్పటికే ఏడు సినిమాల్లో నటించి ప్రతిష్ఠాత్మక `కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్` సైతం అందుకున్న రజీషా కి.. ధనుష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `కర్ణన్` తమిళంలో తొలి చిత్రం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తితో సినిమాలు చేస్తోంది. కట్ చేస్తే.. ఇప్పుడు రవితేజ చిత్రంతో టాలీవుడ్ బాట పట్టడం ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే రవితేజ - శరత్ మండవ చిత్రంలో రజీషా విజయన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. రవితేజకి సరసన రజీషా ఏ మేరకు మెస్మరైజ్ చేస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |