![]() |
![]() |

ప్రస్తుతం మన దేశంలో సెలబ్రిటీలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సోనూసూద్. ఈ కరోనా కష్ట కాలంలో ఎందరో సామాన్యులకు సాయం చేస్తూ ఆయన రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఒకప్పుడు సినిమాల్లో విలన్ వేషాలు వేసి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ ను.. ఇకపై ప్రేక్షకులు విలన్ గా చూసి రిసీవ్ చేసుకోవడం కష్టమనే చెప్పాలి. అందుకేనేమో డైరెక్టర్లు కూడా ఆయనను ఇకపై హీరోగానే చూపించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. సోనూసూద్ తో డైరెక్టర్ క్రిష్ పాన్ ఇండియా మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
ప్రస్తుతం క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలాఉంటే క్రిష్ తన తదుపరి సినిమాను సోనూసూద్ తో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 'మణికర్ణిక' సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. సోనూసూద్ పాత్ర విషయంలోనే క్రిష్ ఆ మూవీ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సాన్నిహిత్యంతోనే సోనూసూద్ తో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకు క్రిష్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తారని ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |