![]() |
![]() |

తమిళనాట ఘనవిజయం సాధించిన `కర్ణన్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మాతృకలో వెర్సటైల్ యాక్టర్ ధనుష్ పోషించిన పాత్రలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ దర్శనమివ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి `కొత్త బంగారు లోకం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. విడుదలకు సిద్ధమైన శ్రీకాంత్ అడ్డాల తాజా చిత్రం `నారప్ప` (విక్టరీ వెంకటేశ్) కూడా ధనుష్ నటించిన `అసురన్`కి రీమేక్ కావడం విశేషం.
తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పుచేర్పులు చేసి మరీ.. `కర్ణన్` రీమేక్ ని తెరకెక్కించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే `కర్ణన్` రీమేక్ లో శ్రీకాంత్ అడ్డాల ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మొత్తమ్మీద.. కెరీర్ ఆరంభంలో స్ట్రయిట్ సబ్జెక్ట్స్ పైనే ఫోకస్ చేసిన శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు రీమేక్ బాట పట్టడం ఆసక్తి రేకెత్తించే అంశమనే చెప్పాలి. మరి.. `అసురన్`, `కర్ణన్` రీమేక్స్ తో శ్రీకాంత్ అడ్డాల ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.
కాగా, `కర్ణన్` తమిళ వెర్షన్ కి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.
![]() |
![]() |