![]() |
![]() |

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ 'సాఫ్ట్‌వేర్ సుధీర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించాడు. ఇప్పుడు సుధీర్-రాజశేఖర్ రెడ్డి కాంబినేషన్ లో 'గాలోడు' అనే మరో సినిమా రాబోతోంది. నేడు(మే19) సుధీర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సిగరెట్ నోట్లో పెట్టుకొని రఫ్ లుక్ తో ఉన్న ఈ తాజా పోస్టర్ చూస్తుంటే ఈసారి సుధీర్ మాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది.
తాజాగా విడుదలైన 'గాలోడు' పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చక్కని కథాంశంతో రూపొందుతుందని, ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. 'జబర్దస్త్', 'ఢీ' వంటి షోలతో సుధీర్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌తో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. 'సాఫ్ట్‌వేర్ సుధీర్' తో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సుధీర్.. గాలోడుతో అలరిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |