![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ సరసన కనువిందు చేసిన నాయికల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. `లక్ష్మీ` (2006), `తులసి` (2007), `బాబు బంగారం` (2016) చిత్రాల్లో ఈ జంట ఆకట్టుకుంది. కట్ చేస్తే.. త్వరలో ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టనున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 2022 ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళే ఈ చిత్రంలో నాయిక పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉందట. ఈ నేపథ్యంలో.. నయనతారని ఎంపిక చేసే ఆలోచనలో యూనిట్ ఉందని టాక్. అదే గనుక నిజమైతే.. వెంకీ, నయన్ కాంబినేషన్ లో వచ్చే నాలుగో సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే వెంకీ - నయన్ ఫోర్త్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానున్నది.
కాగా, ప్రస్తుతం వెంకీ చేతిలో `నారప్ప`, `దృశ్యం 2`, `ఎఫ్ 3` చిత్రాలున్నాయి. వీటిలో తొలి రెండు సినిమాలు చిత్రీకరణ పూర్తిచేసుకున్నాయి. ఇక నయన్ విషయానికొస్తే.. `నేట్రికన్`, `అణ్ణాత్తే`, `కాత్తు వాక్కుల రెండు కాదల్` అనే తమిళ చిత్రాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ సంగతికొస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సిద్ధమవుతున్నారు.
![]() |
![]() |