![]() |
![]() |

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతుల ముద్దుల తనయ సితారకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ బేస్ చిన్నదేమీ కాదు. స్టార్ కపుల్‌కు తగ్గ కూతురుగా ఎనిమిదేళ్ల సితార సూపర్ పాపులర్ అయిపోయింది. స్టైలింగ్ విషయంలోనూ, డాన్సుల విషయంలోనూ ఆమె సూపర్ స్మార్ట్. వాటికి సంబంధించిన ఫొటోలను ఆమె తన సొంత ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తుంటుంది.
అంతే కాదు, తమ ఇంట్లో ఆడే ఆటలు, అమ్మానాన్నలతో, అన్నయ్యతో కలిసి సరదాగా టైమ్ గడిపే సందర్భాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటోంది.
లేటెస్ట్‌గా తన అన్న గౌతమ్‌తో కలిసి తమ ఇంట్లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతున్న రెండు ఫొటోలను షేర్ చేసింది సితార. ఈ ఫొటోల్లో ఇద్దరూ నీళ్లలోపల తేలుతూ కెమెరాకు పోజులివ్వడం విశేషం. "అన్నయ్య గౌతమ్‌తో కలిసి మా స్విమ్మింగ్ పూల్ లోతుల్లో తేలుతూ.." అని వాటికి క్యాప్షన్ జోడించింది సితార. వీటికి స్వల్ప కాలంలోనే 30 వేలకు పైగా లైక్స్, వందలాది కామెంట్స్ వచ్చాయి. వాటిలో తల్లి నమ్రత నుంచి వచ్చిన కామెంట్ కూడా ఉంది. ఆమె "love u both" అంటూ కామెంట్ పెట్టారు.

![]() |
![]() |