![]() |
![]() |

క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన 'వేదం' చిత్రంలో శరణ్య మావయ్య రాములు పాత్రలో నటించడం ద్వారా వెలుగులోకి వచ్చిన నాగయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన స్వస్థలం గుంటూరు జిల్లా దేచవరంలోని నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. 'వేదం' చిత్రంలో నాగయ్య నోటి నుంచి వచ్చిన :పద్మా.. మన పైసలు దొరికాయే.. నీ బిడ్డ సదూకుంటాడే" లాంటి డైలాగులను ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోరు.
ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో నాగయ్య కనిపించారు. 'వేదం'తో మంచి పేరు వచ్చినా ఆశించిన రీతిలో ఆయనకు అవకాశాలు రాలేదు. వేషాల కోసం ఆయన ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతూ వచ్చారు. వేషాలు తగ్గిపోవడం, వేషాలు వచ్చినా రెమ్యూనరేషన్ బాగా తక్కువగా ఇవ్వడంతో ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. కరోనా మహమ్మారి దెబ్బకు షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఆయన పరిస్థితి మరింత దిగజారింది. నాగయ్య ఇబ్బందులు తెలుసుకున్న కేటీఆర్ ఆయనకు ఆర్థిక సాయం చేశారు.
![]() |
![]() |