![]() |
![]() |

మహేశ్‌కు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్ సంబరాలకు అంతు ఉండదు. అలాంటిది అతను సందీప్‌రెడ్డి వంగాతో కలిసి పనిచేస్తున్నాడనే న్యూస్, దానికి సంబంధించిన ఫొటోలు బయటకు వస్తే ఇంక చెప్పేదేముంది! మంగళవారం నుంచి అదే జరుగుతోంది. అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో హావెల్స్ కంపెనీకి సంబంధించిన ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు మహేశ్. అతనికి మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తోడయ్యింది.

సినిమాకు పనిచేయకపోయినా, ఒక యాడ్‌కు మహేశ్, సందీప్‌రెడ్డి కలిసి పనిచేయడం సోషల్ మీడియాను హీటెక్కించింది. దానికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌ను సునామీలా చుట్టేశాయి. ఇంకా చుట్టేస్తూనే ఉన్నాయి. 'మహేశ్‌బాబు' అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాంతో పాటు 'సర్కారువారి పాట' హ్యాష్‌ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయ్యింది. హావెల్స్ రిఫ్రిజిరేటర్‌కు అటు ఇటు మహేశ్, తమన్నా నిల్చొని ఉన్న ఫొటోతో పాటు సందీప్‌రెడ్డితో, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవరికర్‌తో మహేశ్ ముచ్చట్లు చెప్తున్న ఫొటోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

కొంతమంది ఫ్యాన్స్ మహేశ్, సందీప్‌రెడ్డి కాంబినేషన్‌లో సినిమా వస్తే సూపర్‌గా ఉంటుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక్క రోజులోనూ ఈ యాడ్ షూట్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం మహేశ్ 'సర్కారువారి పాట' సినిమా చేస్తుంటే, సందీప్‌రెడ్డి హిందీలో 'యానిమల్' మూవీ చేస్తున్నాడు. భవిష్యత్తులో ఆ ఇద్దరూ కలిసి సినిమా చేసే ఛాన్సులు చాలానే ఉన్నాయి. ఇప్పటికే మహేశ్‌కు సందీప్ కథ వినిపించాడేమో... చూద్దాం ఏం జరుగుతుందో!

![]() |
![]() |