![]() |
![]() |

అక్కినేని బుల్లోడు అఖిల్ తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` విడుదలకు సిద్ధమైంది. `బొమ్మరిల్లు` భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జూన్ 19న థియేటర్స్ లో సందడి చేయనుంది. కాగా, ఈ లోపే తన నెక్స్ట్ వెంచర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు అఖిల్.
ఆ వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `అఖిల్ 5`గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో షూటింగ్ ని ప్రారంభించడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. కథ, పాత్ర నచ్చడంతో మోహన్ లాల్ కూడా ఈ ప్రాజెక్ట్ కి వెంటనే ఓకే చెప్పారట. త్వరలోనే `అఖిల్ 5`లో మోహన్ లాల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. మోహన్ లాల్ తెలుగులో తొలిసారిగా కనిపించిన `గాండీవం`లో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. `గోరువంక వాలగానే` అంటూ సాగే పాటలో ఏయన్నార్ తో చిందులేశారు లాల్. కట్ చేస్తే.. ఇప్పుడు ఏయన్నార్ మనవడు అఖిల్ తో కలిసి నటించనుండడం విశేషమనే చెప్పాలి. కాగా `మనమంతా`, `జనతా గ్యారేజ్` (2016) తరువాత లాల్ నటించబోయే తెలుగు సినిమా ఇదే కావచ్చు.
![]() |
![]() |