![]() |
![]() |

ప్రపంచంలోని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యంద ధనిక ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ఇప్పటికే నిర్మించిన 'బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్' సిరీస్ వెర్షన్‌ను అది చెత్తబుట్టలో పడేసింది. దాని స్థానంలో సరికొత్త వెర్షన్ పనులను ఇప్పటికే ప్రారంభించింది. దీని కోసం రూ. 200 కోట్లను వెచ్చిస్తోంది.
ఇప్పటికే తీసిన వెర్షన్‌తో నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులు శాటిస్‌ఫై కాలేదు. అందుకే దాన్ని పక్కన పెట్టేయాలని వారు డిసైడ్ చేసుకున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ మీద వాళ్లు మళ్లీ పనిచేశారు. తారాగణం, టెక్నికల్ టీమ్‌ను మార్చి, 'బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్'ను రీషూట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఇండియాలో తాము వెచ్చించనంత డబ్బుతో అత్యంత భారీ స్థాయిలో దీన్ని తీస్తున్నారు. 'గేమ్ ఆఫ్ త్రోన్స్' తరహాలో 'బాహుబలి' వర్కవుట్ అవుతుందనేది వారి ఆశ. అందుకే ఇంత పెద్ద రేంజిలో దాన్ని తీస్తున్నారు. ఈ కొత్త వెర్షన్‌కు వారు రూ. 200 కోట్లు కేటాయించారు. ఇప్పటికే తీసిన వెర్షన్‌కు పెట్టిన దాన్ని కూడా కలిపితే, ఈ ప్రాజెక్ట్ వాల్యూ రూ. 300 కోట్లు అవుతుంది!
9 ఎపిసోడ్ల చొప్పున రెండు సీజన్లు ఉండే ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి యస్.యస్. రాజమౌళి నిర్మిస్తున్నారు. మాహిష్మతీ సామ్రాజ్యానికి శివగామి ఎలా వచ్చింది, ఎలా వీరవనితగా పేరు తెచ్చుకుందనేది ఇందులోని ప్రధానాంశం. అంటే ఇది.. 'బాహుబలి'కి ప్రిక్వెల్ అన్నమాట. పక్కన పెట్టిన వెర్షన్‌లో శివగామి క్యారెక్టర్‌ను 'సూపర్ 30', 'బాట్లా హౌస్' సినిమాల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసింది. కొత్త వెర్షన్‌లోనూ ఆమే చేస్తుందా, మరొకరు ఆమె స్థానంలోకి వచ్చారా అనే విషయం తెలియాల్సి ఉంది.
![]() |
![]() |