![]() |
![]() |

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన దగ్గరి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా సందడి చేస్తున్నారు. ప్రత్యేకమైన వీడియోలను షేర్ చేస్తూ వీక్షకులకు నయనానందాన్ని కలిగిస్తున్నారు. 'వాతీ కమింగ్' లాంటి తమిళ పాటలకు వీరలెవెల్లో చిందులేసి ప్రగతి ఆంటీ అబ్బురపరిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత వర్కవుట్‌లకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ యంగ్‌స్టర్స్‌కి ఛాలెంజ్‌లు విసిరి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
కెరీర్ తొలి నాళ్లలో భాగ్యరాజా రూపొందించిన 'గౌరమ్మా నీ మొగుడెవరమ్మా' చిత్రంలో ఎలాంటి బెరుకు లేకుండా బైక్ నడిపి అప్పట్లోనే సంచలనం సృష్టించిన ప్రగతి తాజాగా బుల్లెట్‌ని నడిపి ఔరా అనిపించారు. అది కూడా శారీలో ఈ ఫీట్‌ని చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెడ్ కలర్ బుల్లెట్‌పై నటి ప్రగతి రైడ్ చేస్తుంటే రోడ్డుపై వున్న వాళ్లంతా తమ ఫోన్‌లకి పని కల్పించారు. ఈ వీడియోను తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా ఇటీవల షేర్ చేశారు ప్రగతి.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నట్టుండి ప్రగతి బుల్లెట్ రైడ్ చేయడానికి కారణం.. ఆమెని ఎవరైనా ఛాలెంజ్ చేశారేమో అని అనుకుంటున్నారు. మొత్తానికి యంగ్ ఏజ్‌లో 90ల్లోనే బైక్ నడిపి ఆశ్చర్యపరిచిన ప్రగతి తాజాగా ఈ ఏజ్‌లో బుల్లెట్ నడపడం విశేషమే అంటూ చెప్పుకుంటున్నారు.

![]() |
![]() |