![]() |
![]() |

టాలీవుడ్‌లో సింహం అనగానే మనకు నందమూరి బాలకృష్ణ జ్ఞాపకం వస్తారు. 'సింహా', 'సింహం' అనే టైటిల్స్‌తో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఆయనే మరి. అంతే కాదు, 'లెజెండ్' లాంటి సినిమాల టైటిల్ డిజైన్‌లోనూ సింహం ఉండటం మనకు తెలుసు. అయితే 'సింహా' అనే శబ్దానికీ, మహేశ్‌కూ సంబంధం ఉంటుందని ఎవరైనా ఊహించగలరా? కానీ, అది ఊహ కాదు, నిజం. మహేశ్ వాట్సాప్ నంబర్‌కు ఉన్న డిస్‌ప్లే ఫొటోలో సింహం ఉంది!
నాగార్జున షేర్ చేసిన ఒక వాట్సాప్ సంభాషణ స్క్రీన్ షాట్ వల్ల ఈ విషయం బయటపడింది. నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న 'వైల్డ్ డాగ్' ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. దానికి సంబంధించిన ప్రమోషన్‌కు చిరంజీవి, మహేశ్‌తో తను చేసిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్‌ను వాడేసుకున్నాడు నాగార్జున.
'వైల్డ్ డాగ్' ట్రైలర్‌ను మహేశ్‌కు పంపాడు నాగ్. అది చూసి, తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా దాన్ని ప్రశంసించాడు మహేశ్. ఇంటెన్స్‌గా, యాక్షన్ ప్యాక్డ్‌గా ట్రైలర్ ఉందని, ప్రపంచానికి చెప్పాల్సిన కథ అనీ, నాగార్జున బెస్ట్‌గా కనిపిస్తున్నారనీ తన ట్వీట్‌లో ప్రశంసించాడు.
అంతే కాదు, ట్రైలర్‌కు సంబంధించి నాగార్జునకూ, మహేశ్‌కూ మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగింది. "ఇప్పుడే టీజర్ చూశాను. టెర్రిఫిక్‌గా కనిపిస్తోంది. టూ కూల్" అని మహేశ్ అంటే, "థాంక్యూ మహేశ్.. ట్రైలర్ రిలీజ్‌కు ముందు ఈ స్క్రీన్‌షాట్‌ను ఉపయోగించుకుంటే నీకు ఓకేనా?" అని నాగ్ ప్రశ్నించాడు. "అఫ్‌కోర్స్" అని మహేశ్ ఓకే చెప్పగా, "థాంక్యూ మహేశ్" అని రిప్లై ఇచ్చాడు నాగ్. ఈ స్క్రీన్‌షాట్‌ను నాగ్ ప్రమోషన్‌కు వాడుకున్నాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ మహేశ్ వాట్సాప్ డీపీ చూసినవాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీలవుతున్నారు. మహేశ్ నంబర్‌ను "మహేశ్ యాక్టర్" అని ఇంగ్లిష్‌లో సేవ్ చేసుకున్నాడు నాగ్. దాని డీపీలో కూర్చొని ఉన్న సింహం కనిపిస్తోంది. దాన్ని చూసి, మహేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా!.. అనుకుంటున్నారంతా.

![]() |
![]() |