![]() |
![]() |

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో అనుష్క ఒకరు. 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె, 'బాహుబలి' మూవీతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్యతారగా మారింది. ఆమె కెరీర్‌లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. అనుష్క తన అమ్మానాన్నలతో ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది.
ఈరోజు అనుష్క పేరెంట్స్ పెళ్లిరోజు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆ ఇద్దరితో కలిసున్న పిక్చర్‌ను షేర్ చేసింది అనుష్క. దానికి, "హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పాపా అండ్ అమ్మ" అనే క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటోను ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అనుష్క ఈ పోస్ట్‌ను షేర్ చేయడం ఆలస్యం.. కేవలం రెండు గంటల్లోనే మూడు లక్షల పైగా లైక్స్ వచ్చాయంటే ఈ రేంజ్‌లో ఫ్యాన్స్ దీన్ని ఆదరిస్తున్నారో ఊహించుకోవాల్సిందే.
ప్రఫుల్ల, ఎ.ఎన్. విఠల్ శెట్టి దంపతుల చిన్న కూతురు అనుష్క. ఆమెకు ఇద్దరు అన్నలున్నారు. బీసీఏ చదివిన అనుష్క యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్ చేసింది. ఆ తర్వాత నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'సూపర్' మూవీతో నటిగా తెరంగేట్రం చేసింది. 'అరుంధతి' మూవీ ఆమె కెరీర్‌ను మార్చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అనుష్క వయసు 39 సంవత్సరాలు.
![]() |
![]() |