![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టిస్టారర్ `ఆచార్య`. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామా.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా నటించబోతున్నట్లు సమాచారం. నితిన్ హీరోగా నటించిన `భీష్మ`తో పాటు నాగశౌర్య కథానాయకుడిగా నటించిన `అశ్వథ్థామ`లోనూ జిషు ప్రతినాయకుడిగా నటించారు. కట్ చేస్తే.. ఇప్పుడు చిరు, చరణ్ కాంబోకి విలన్ అవుతున్నారు జిషు. మరి.. జిషు సేన్ గుప్తా విలనిజం `ఆచార్య`కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, `ఆచార్య`లో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక చరణ్ కి జంటగా పూజా హెగ్డే దర్శనమివ్వనుందని సమాచారం. అలాగే సోనూసూద్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేసవి కానుకగా మే 13న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |