![]() |
![]() |

సినీ రంగానికి తమ వంతు సేవలందించడం ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచిన కళాకారులకు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డులను ప్రకటించడం ద్వారా వారిని గౌరవించింది. అలనాటి మహానటీమణులు షావుకారు జానకి, బి. సరోజాదేవి, గాయనీమణి జమునారాణి ఈ ఏడాది కలైమామణి పురస్కారాలను అందుకోనున్నారు.
అలాగే నేటి తరానికి వస్తే నటుడు శివ కార్తికేయన్, తారలు ఐశ్వర్యా రాజేశ్, సంగీత, దేవదర్శిని, కమెడియన్ యోగిబాబు, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, నిర్మాతలు కలైపులి ఎస్. ధాను, సంగీత దర్శకులు డి. ఇమ్మాన్, దీన, సినిమాటోగ్రాఫర్ రఘునాథరెడ్డి లాంటి వాళ్లున్నారు.
షావుకారు జానకి, సరోజాదేవి, జమునారాణి దక్షిణాదిలోని నాలుగు భాషా చిత్రసీమల్లో పనిచేశారు. షావుకారు జానకి తెలుగువాళ్ల ఆడపడుచు. సరోజాదేవి తెలుగులో పలు గొప్ప చిత్రాల్లో నటించారు. జమునా రాణి గాన మాధుర్యంలో తెలుగువాళ్లు ఓలలాడారు. ఐశ్వర్యా రాజేశ్ అయితే 'మల్లెమొగ్గలు' హీరో దివంగత రాజేశ్ కుమార్తె. సంగీత పలు తెలుగు సినిమాల్లో నాయికగా నటించింది.
![]() |
![]() |