![]() |
![]() |
.jpg)
నటి-గాయని డెమీ లొవాటో 2018లో అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకొని, దాదాపు చావు దాకా వెళ్లి బతికి బట్టకట్టింది. లాస్ ఏంజెల్స్‌లోని నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హాస్పిటల్‌లో చేర్చారు. ఆ ఘటన గురించి ఇప్పుడు నోరు విప్పింది లొవాటో. "నాకు మూడు స్ట్రోక్స్, ఒక హార్ట్ ఎటాక్ వచ్చాయి. నేను ఐదు నుంచి పది నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకనని డాక్టర్లు చెప్పారు." అని ఆమె గుర్తు చేసుకుంది.
డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగా తన మెదడు దెబ్బతిన్నదని ఆమె చెప్పింది. "ఇప్పటికీ దాని ప్రభావాన్ని చవిచూస్తూనే ఉన్నాను. నేను కారును డ్రైవ్ చేయలేను, ఎందుకంటే నా కంటిచూపులో బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. చాలా కాలం అక్షరాలు చదవలేకపోయాను. మసకమసకగా కనిపించేది. రెండు నెలల తర్వాతే అతికష్టంగా నేను బుక్ చదవగలిగాను." అని లొవాటో వెల్లడించింది.
ఆ ఘటన నుంచి చాలా నేర్చుకున్నాననేది ఆమె మాట. "అదొక బాధాకర ప్రయాణం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, డ్రగ్ ఓవర్‌డోస్ తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులు, పడిన బాధ గుర్తుకువచ్చి చాలా బాధ కలుగుతుంది." అని చెప్పింది లొవాటో.
సింగర్‌గా లొవాటో సూపర్ పాపులర్. 'డోన్ట్ ఫర్‌గెట్ (2008) ఆల్బమ్‌తో ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ ఆదరణను పొందిన ఆమె, ఆ తర్వాత హియర్ వియ్ గో అగైన్, స్కైస్క్రేపర్, గివ్ యువర్ హార్ట్ ఎ బ్రేక్ వంటి ఆల్బమ్స్‌తో టాప్ పాప్ సింగర్‌గా పేరు తెచ్చుకుంది. ఆమెకు వచ్చిన అవార్డులకు లెక్కే లేదు.
![]() |
![]() |