![]() |
![]() |

గత ఏడాది మూడు సినిమాలతో సందడి చేయాలనుకున్న యువ కథానాయకుల్లో నితిన్ ఒకరు. అయితే కరోనా ఎఫెక్ట్ తో `భీష్మ`తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో.. 2021ని తన `త్రిచిత్ర ప్రణాళిక`కి లక్ష్యంగా చేసుకున్నాడు ఈ `ద్రోణ` స్టార్.
అంతేకాదు.. కేవలం 106 రోజుల్లోనే 3 సినిమాలతో పలకరించబోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. `భీష్మ` వంటి ఘనవిజయం తరువాత నితిన్ నుంచి వస్తున్న చిత్రాలు కావడంతో.. ఈ మూడింటిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ చిత్రాలే.. `చెక్`, `రంగ్ దే`, `అంధాధున్` రీమేక్.
చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ `చెక్` ఫిబ్రవరి 26న రానుండగా.. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న `రంగ్ దే` మార్చి 26న రిలీజ్ కానుంది. ఇక మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న `అంధాదున్` రీమేక్ జూన్ 11న తెరపైకి రానుంది. మొత్తమ్మీద.. 2021 ఫస్టాఫ్ లో నితిన్ దే హవా అన్నమాట. మరి.. ఈ సినిమాలతో నితిన్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |