![]() |
![]() |
.jpg)
విక్టరీ వెంకటేశ్ కి అచ్చొచ్చిన నాయికల్లో అభినేత్రి మీనా ఒకరు. వీరిద్దరి కలయికలో.. `చంటి`, `సుందరకాండ`, `అబ్బాయిగారు`, `సూర్యవంశం`, `దృశ్యం`.. ఇలా ఐదు చిత్రాలు రాగా, అవన్నీ కూడా విజయం సాధించాయి.
కట్ చేస్తే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రాబోతోందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ `దృశ్యం`కి సీక్వెల్ గా `దృశ్యం 2` రూపొందిన సంగతి తెలిసిందే. `దృశ్యం`కి పర్ ఫెక్ట్ సీక్వెల్ గా తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మోహన్ లాల్, మీనా జంటగా నటించారు. ఈ రోజు (ఫిబ్రవరి 19) నుంచి అమేజాన్ ప్రైమ్ లో కేవలం మలయాళ భాషలోనే స్ట్రీమ్ అవుతున్న ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
కాగా, ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అంతేకాదు.. ఒరిజినల్ వెర్షన్ ని రూపొందించిన జీతూ జోసెఫ్ నే దీన్ని డైరెక్ట్ చేశారని టాక్. అలాగే.. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన మీనానే ఈ రీమేక్ లోనూ కొనసాగుతుందని టాక్. మరి.. వెంకీ, మీనా జంట డబుల్ హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.
![]() |
![]() |