![]() |
![]() |

ఓ పనైపోతుంది బాబూ, విక్రమార్కుడు, దరువు, కిక్ 2, డిస్కో రాజా చిత్రాల తరువాత మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా.. ఖిలాడి. రాక్షసుడు ఫేమ్ రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రవితేజకి జోడీగా మీనాక్షి దీక్షిత్, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడి పాత్రలో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న ఫస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసిన యూనిట్.. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న టీజర్ ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఇందులో రవితేజ రెండు పాత్రలకు సంబంధించిన విజువల్స్ ఉంటాయని టాక్. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది. కాగా, మే 28న ఖిలాడి థియేటర్స్ లో సందడి చేయనుంది.
మరి.. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత రవితేజ నుంచి రాబోతున్న ఖిలాడి కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |