![]() |
![]() |

మిర్చి, భాగమతి వంటి విజయవంతమైన చిత్రాల తరువాత లేడీ సూపర్ స్టార్ అనుష్క, సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రా రా కృష్ణయ్య ఫేమ్ మహేశ్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు.. ఇటీవల ఎలాంటి హంగులు లేకుండా యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయని టాక్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో స్వీటీతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి కూడా ప్రధాన పాత్రలో దర్శనమివ్వబోతున్నాడట. అయితే అనుష్క - నవీన్ పాత్రల మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉంటుందో అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా, నిశ్శబ్దం తరువాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక నవీన్ విషయానికి వస్తే.. అతను ప్రధాన పాత్రలో నటించిన జాతిరత్నాలు మహాశివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |