![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు. ఇందులో తన తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మల్టిస్టారర్.. మే 13న రిలీజ్ కానుంది. ఆపై 'లూసీఫర్' రీమేక్ లో నటించబోతున్నారు చిరు. అలాగే పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది.
ఇదిలా ఉంటే.. కథానుసారం చిరు - బాబీ కాంబినేషన్ లో రానున్న సినిమాలోనూ మరో హీరోకి స్థానముందట. ఓ ప్రముఖ కథానాయకుడు ఆ పాత్రను పోషించే అవకాశముందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆ హీరో ఎవరో క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా 'గబ్బర్ సింగ్' బ్యూటీ శ్రుతి హాసన్ నటించనుందని టాక్. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
![]() |
![]() |