![]() |
![]() |

నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏజెంట్ గా కింగ్ నాగార్జున నటించిన సినిమా 'వైల్డ్ డాగ్'. 'ఊపిరి' రచయిత అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నాగ్ కి జంటగా మాజీ మిస్ ఆసియా పసిఫిక్ దియా మీర్జా నటించగా.. కీలక పాత్రలో సయామీ ఖేర్ దర్శనమివ్వనున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అదే రోజున యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న 'సీటీమార్' సినిమా రిలీజ్ కానుంది. సంపత్ నంది రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో తమన్నా భాటియా, దిగంగన సూర్యవంశీ నాయికలుగా నటిస్తుండగా భూమికా చావ్లా కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.
మరి.. నాగార్జున వర్సెస్ గోపీచంద్ అన్నట్లుగా సాగనున్న ఈ బాక్సాఫీస్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. కాగా, అటు నాగ్.. ఇటు గోపీచంద్.. ఇద్దరు కూడా విజయాలు చూసి చాలా కాలమే అవుతుండడం గమనార్హం.
![]() |
![]() |