![]() |
![]() |

సూర్య హీరోగా నటిస్తోన్న 40వ చిత్రం షూటింగ్ సోమవారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌మోహన్ నాయిక. మొదట ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక, సెట్స్‌పై సూర్య జాయిన్ అవుతారని సమాచారం. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను సత్యరాజ్ పోషిస్తున్నారు.
డి. ఇమ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇదివరకు సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' (సూరారై పొట్రు) చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజై ఇటు వీక్షకుల ఆదరణ, అటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆస్కార్ ఎంట్రీగా పోటీలోనూ ఆ సినిమా నిలిచింది.
మరోవైపు 'పసంగ' లాంటి పలు అవార్డులు పొందిన చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పాండిరాజ్, మెరీనా, కేడీ బిల్లా కిలాడీ రంగా, నమ్మ వీట్టు పిళ్లై లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన 'పసంగ 2'ను సూర్య నిర్మించడమే కాకుండా, అందులో ఓ కీలక పాత్ర చేశారు.
![]() |
![]() |