![]() |
![]() |

కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటించిన మన్మథుడులో సెకండ్ లీడ్ గా సందడి చేసిన అన్షు గుర్తుందా? మహేశ్వరి పాత్రలో ముద్దు ముద్దు మాటలతో మురిపించిన ఈ లండన్ భామ.. ఆపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాఘవేంద్రలోనూ దర్శనమిచ్చారు. అలాగే భూమిక మిస్సమ్మలో అతిథి పాత్రలోనూ.. యంగ్ టైగర్ యన్టీఆర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఆదికి రీమేక్ గా తమిళంలో తెరకెక్కిన జైలోనూ నాయికగానూ సందడి చేశారు. ఆనక మరే చిత్రంలోనూ కనిపించని ఈ టాలెంటెడ్ బ్యూటీ.. పెళ్ళయ్యాక చాన్నాళ్ళ తరువాత రి-ఎంట్రీకి సిద్ధమవుతున్నారట. అది కూడా.. ఓ భారీ బడ్జెట్ మూవీలో..
ఆ వివరాల్లోకి వెళితే.. యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అరవింద సమేత తరువాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రలో అన్షు నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. కథ, పాత్ర నచ్చడంతో పాటు.. మన్మథుడు టైమ్ నుంచి త్రివిక్రమ్ అంటే ప్రత్యేక అభిమానం ఉండడంతో యన్టీఆర్ 30లో నటించేందుకు అన్షు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే యన్టీఆర్ 30లో అన్షు ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |