![]() |
![]() |

`స్టార్ మా`లో ప్రసాదరం అవుతున్న మోస్ట్ పాపపులర్ సీనియల్ `కార్తీక దీపం`. వంటలక్క కారణంగా మహిళాలోకానికి హాట్ ఫేవరేట్‌గా మారిపోయింది. వంటలక్క దీప పాత్రలో నటించిన ప్రేమి వైద్యనాథ్ ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా స్టార్ సెలబ్రిటీల జాబితాలో చేరిపోయింది. ఈ శనివారం `కార్తీక దీపం` 954వ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది.
ఒక విధంగా చెప్పాలంటే ఈ నెలలో ప్రసారమైన ఎపిసోడ్‌లకే హైలైట్‌గా నిలవబోతోంది. అనుకోకుండానే డాక్టర్ బాబు తన మాజీ ప్రేమసి హిమ ఇంటి ముందు కారులో ఆగిపోతాడు. తనని హిమ తల్లి లక్ష్మమ్మ పిలిచినట్టుగా తోస్తుంది. వెంటనే హిమ జ్ఞాపకాల్ని తలుచుకుంటూ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.. గోడపై పూల దండలు అలంకరించిన హమ ఫొటో కనిపిస్తుంది. తను హిమని ప్రేమించిన నాటి సంగతుల్ని గుర్తు చేసుకుంటూ వుంటాడు కార్తీక్ ఇంతలో లక్ష్మమ్మ ఓ గదిలోంచి బయటికి వచ్చేస్తూ కార్తీక్ ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ప్రతీ పుట్టిన రోజున గుడికి తీసుకువెళ్లేదాన్ని.. పూజారి ఇలాగే ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని దీవించేవాడు. ఇప్పటికీ హిమ పుట్టిన రోజులు జరుపుకుంటూనే వుంది. చూశారా బాబు ఈ ఏడాది తన పుట్టిన రోజుకు మిమ్మల్ని కూడా రప్పించేసింది., అని లక్ష్మమ్మ మాట్లాడుతుండగానే దీప అదే గదిలోంచి పూల బొకేతో ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఊహించని దీపి ఎంట్రీకి డాక్టర్ బాబు ఏంటిదని షాకవుతాడు. అప్పుడు అసలు విషయం చెబుతుంది. హిమ స్థానంలోకి నేనొచ్చాను. కానీ నేను ఉండాల్సిన స్థానంలో లేను. హిమ చనిపోయి దూరమైతే.. నేను బ్రతికుండే దూరమయ్యాను. ఇద్దరం బలైపోయింది ఒక్కరి వల్లే. ఆ ఒక్కరు ఎవరో కాదు ఓ దెయ్యం అంటుంది దీప.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరో దీప కార్తీక్‌కి చెప్పేసిందా?. హిమ ఇంటికి దీప ఎందుకు వచ్చింది. కార్తీక్‌ని కూడా అక్కడికి వచ్చేలా ఎందుకు చేసింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |